ఇంతకీ అనుష్క, నవీన్ పొలిశెట్టితో ఈ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరో కాదు.. మహేశ్. ఈ డైరెక్టర్ ఇది వరకు సందీప్‌కిషన్, రెజీనాలతో 'రా రా కృష్ణయ్య' సినిమాను తెరకెక్కించాడు. డైరెక్టర్ మహేశ్ చెప్పిన కథ విన్న అనుష్క, ఈ వైవిధ్యమైన ప్రేమ కథలో నటించడానికి అనుష్క ఓకే చెప్పింది. గత ఏడాది ఓటీటీలో విడుదలైన 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిందీ పొడుగుకాళ్ల సుందరి. కానీ 'నిశ్శబ్దం' సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క.. ఇప్పుడు మహేశ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంతకు ముందు అనుష్కతో 'భాగమతి' సినిమాను చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.