ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైసీపీకి గుణపాఠం

ABN , First Publish Date - 2021-01-22T05:06:53+05:30 IST

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఓటు ద్వారా వైసీపీకి గుణపాఠం చెబుతారని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైసీపీకి గుణపాఠం
మాట్లాడుతున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల

నాయుడుపేట, జనవరి 21 : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఓటు ద్వారా వైసీపీకి గుణపాఠం చెబుతారని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతిలో నిర్వహించే ధర్మపరిరక్షణయాత్రకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలసి గురువారం స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి బయటుదేరి వెళ్లారు. అంతకుముందు నాయుడుపేటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలీ్‌సశాఖను అడ్డంపెట్టుకొని టీడీపీ నేతలను అన్యాయంగా అరెస్టు  చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలీసులు బుధవారం రాత్రి టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్‌రావు ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్టు చేయడం, ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా లెక్కచేయకుండా వ్యవహరించడం మంచిదికాదన్నారు. కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీ్‌షరెడ్డి, నాయకులు పేరం మధునాయుడు, వేలూరు మురళీకృష్ణారెడ్డి, గుజ్జలపూడి విజయకుమార్‌నాయుడు, కామిరెడ్డి మురళీరెడ్డి, న్యాయవాది సుధాకర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ధర్మ పరిరక్షణ యాత్రకు నెలవల పయనం 

పెళ్లకూరు : తిరుపతిలో తలపెట్టిన ధర్మపరిరక్షణ సమితి పాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం  ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా నెలవల పెళ్లకూరులో విలేకర్లతో తిరుపతిలో తలపెట్టిన యాత్రకు ముందే భయపడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎక్కడిక్కడ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు.   తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఓడించి టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేనాటి సతీ్‌షరెడ్డి, తిరుమూరు సుధాకర్‌రెడ్డి, పేరం మధుసూధన్‌నాయుడు, వేలూరు మురళీకృష్ణారెడ్డి, అక్కరపల్లి గోపాల్‌రెడ్డి, కందమూడి శివకుమార్‌, సుబ్బరామయ్య, వెంపర్ల వెంకటేశ్వర్లు, నెలవల ప్రసాద్‌, ఓజిలి నాయకుడు విజయకుమార్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:06:53+05:30 IST