డాక్టర్ఆ సర్జరీతో ఫలితం ఉంటుందా?

ABN , First Publish Date - 2020-07-21T22:14:55+05:30 IST

డాక్టర్‌! నా వయసు ఇరవై ఏడేళ్లు. ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వృషణాలకు దెబ్బ తగిలింది. ఆ తర్వాత వృషణాల సైజు తగ్గిపోయింది. పరీక్ష చేయించుకుంటే వీర్యక

డాక్టర్ఆ సర్జరీతో ఫలితం ఉంటుందా?

ఆంధ్రజ్యోతి(21-07-2020)

ప్రశ్న: డాక్టర్‌! నా వయసు ఇరవై ఏడేళ్లు. ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వృషణాలకు దెబ్బ తగిలింది. ఆ తర్వాత వృషణాల సైజు తగ్గిపోయింది. పరీక్ష చేయించుకుంటే వీర్యకణాలు తయారు కావట్లేదని తెలిసింది. ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. వృషణాల మార్పిడితో పిల్లలను కనవచ్చని విన్నాను. ఆ సర్జరీ చేయించుకుంటే ఫలితం ఉంటుందా? 


- ఓ సోదరుడు, హైదరాబాద్‌.


డాక్టర్ సమాధానం: వృషణాలకు దెబ్బ తగిలి, కుంచించుకుపోయినా వాటిలో మిగిలి ఉండే కొద్ది వీర్యకణాలను సంగ్రహించి, గర్భధారణకు ప్రయత్నించవచ్చు. ఇందుకోసం మైక్రోటీసే అనే సర్జరీ ఉపయోగపడుతుంది. కాబట్టి వైద్యులను కలిసి ఈ పరీక్షకు ప్రయత్నించండి. ఒకవేళ వీర్యకణాలు ఏమాత్రం లేని పక్షంలో ఇతరత్రా ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నించవచ్చు. వృషణాల మార్పిడి కూడా మిగతా అవయవ మార్పిళ్ళ లాంటిదే! అయితే వృషణాల మార్పిడి చేయించుకోవాలంటే బ్రెయున్‌ డెడ్‌ పేషెంట్‌ దొరకాలి. అతని రక్తగ్రూపుతో పాటు వయసు, ఇతరత్రా అంశాలు కూడా కలవాలి. పైగా సర్జరీ తర్వాత శరీరం రిజెక్ట్‌ చేయకుండా నెలకు ఐదు వేల రూపాయల ఖరీదైన మందులు జీవితాంతం వాడవలసి ఉంటుంది. వృషణాల మార్పిడి చేసినా, వృషణాలకు మీ నుంచి రక్తం మాత్రమే సరఫరా అవుతుంది. ఆ వృషణాల్లో తయారయ్యే వీర్యంలో జన్యుపదార్థం దాతకు చెందినదే ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వీర్య దానం పద్ధతిని ఆశ్రయించి, పిల్లలను కనడానికి ప్రయత్నించండి.



-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)

Updated Date - 2020-07-21T22:14:55+05:30 IST