ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా పార్టీ పెట్టొచ్చు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-01-25T18:50:02+05:30 IST

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా పార్టీ పెట్టొచ్చు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కరీంనగర్: ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టడానికి వాక్యూమ్ ఉన్నదని తాను అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వలనే వైఎస్ఆర్ సీఎం అయ్యాయరని, అటువంటుపుడు వైఎస్ అభిమానులు షర్మిల పెట్టే పార్టీలో ఎలా చేరుతారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు  ప్రత్యమ్నాయం కాంగ్రెస్సేనని ఆయన పేర్కొన్నారు.


 టీఆర్ఎస్ కు చెందిన సొంత మంత్రులే రాష్ట్రంలో సీఎం మార్పు అని లీకులు ఇస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో తాను సీఎంగా ఉన్నానా లేదా అనే అనుమానంతో సీఎం కేసీఆర్ కుర్చీ తడుముకుంటున్నాడని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంకా తాను సీఎంగానే  ఉన్నట్లు ప్రజల్లో అభిప్రాయం కలిగించేందుకు కేసీఆర్ లీకులు ఇస్తున్నాడని జీవన్ రెడ్డి విమర్శంచారు. 

Updated Date - 2021-01-25T18:50:02+05:30 IST