ఎమ్మెల్సీ అవకాశం ఎవరికో?

ABN , First Publish Date - 2021-05-11T07:00:00+05:30 IST

సరిగ్గా నెల రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 3న మండలిలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్ప డుతున్నాయి. ఈ సారి ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్నారు. ఖాళీ అవుతున్న పద వులన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉండగా, తాజాగా ఎన్నిక జరిగే సమయంలో అసెం బ్లీలో అధికార పార్టీకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల బలం ఉంది.

ఎమ్మెల్సీ అవకాశం ఎవరికో?

నెల రోజుల్లో నియామకం

సీఎంను ప్రసన్నం చేసుకునే యత్నంలో జిల్లా నేతలు

వరుసలో గుత్తా, కోటిరెడ్డి, నేతి, కర్నె, చాడ


సరిగ్గా నెల రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 3న మండలిలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్ప డుతున్నాయి. ఈ సారి ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్నారు.  ఖాళీ అవుతున్న పద వులన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉండగా, తాజాగా ఎన్నిక జరిగే సమయంలో అసెం బ్లీలో అధికార పార్టీకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రతిపక్ష పార్టీలు పోటీకి దిగే అవకాశాలు ఏ మాత్రం లేకపోవడంతో సీఎం నోటి నుంచి పేరు వెలువడటమే ఆలస్యం ఎమ్మెల్సీగా ఎంపికైనట్టే.


నల్లగొండ, మే 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గుత్తా సు ఖేందర్‌రెడ్డి మూడుసార్లు ఎంపీగా ఎన్ని కై కాంగ్రెస్‌ ఎంపీగా ఉండగానే గులాబీ  కండువా  కప్పుకున్నారు. ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్రకుమార్‌ ఒకేసారి టీఆర్‌ఎస్‌లో చేరారు. కేబినెట్‌లో అవకాశ  కల్పిస్తారన్న హామీ మేరకు ఆయన పార్టీ మారినట్టు నాడు ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. పార్టీలో చేరిన తరువాత కొద్ది కాలానికే కేబినెట్‌ హోదా కలిగిన  రైతు సమన్వయ సమతి అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. ఆ తరువాత కొద్ది కాలానికే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి కీలక పదవి శా సన మండలి చైర్మన్‌ను చేశారు. కేబినెట్‌లో అవకాశం మం డలి చైర్మన్‌తో ముగిసిపోయినట్టే అనే చర్చ సాగింది. ఎమ్మె ల్సీగా అవకాశం కల్పించినా రెండేళ్లకే ఆ స్థానం గడువు ముగిసింది. దీంతో గుత్తాకు మరోసారి అవకాశం తప్పని సరి అని ఆయన అనుచరులు అంటున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినా, తిరిగి మండలి చైర్మన్‌ పదవి గుత్తాకే దక్కుతుందా? లేదా? అనే చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్‌ స్పందించే తీరుపైనే గుత్తా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.


ఎంసీ కోటిరెడ్డి, భగత్‌ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తారా?

ఆది నుంచి నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో కీలక నేత గా ఎంసీ.కోటిరెడ్డి కొనసాగుతున్నారు. నోముల నర్సింహయ్య రాకతో కోటిరెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. నర్సింహయ్య హఠాన్మరణంతో ఉప ఎన్నిక అని వార్య మైంది. ఈ నేపథ్యంలో బరిలో కోటిరెడ్డి ఖాయమన్న చర్చ సాగింది. టికెట్‌ రేసులో ఆయన చివరి వరకు ఉన్నారు. ఆయ న్ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు చివరి వరకు ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపఽథ్యంలో నోముల భగత్‌కే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ టికెట్‌ కేటాయించారు. ప్రతిష్ఠాత్మక సాగర్‌ ఉప  ఎన్నికలో గెలుపొందాలంటే ఎంసీ.కోటి రెడ్డి పాత్ర  కీలకం కావడంతో సీఎం ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. భగత్‌ను గెలుపించుకురండి ఎంసీ.కోటిరెడ్డి, భగత్‌ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయన్ను ఎమ్మెల్సీ చేసే బాధ్యత తనదని సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటా నుంచి కోటిరెడ్డిని నిలబెట్టి గెలిపిస్తా అని, కోటిరెడ్డికి పడే తొలి ఓటు తనదే అంటూ సీఎం సాగర్‌ ఉప ఎన్నికల వేళ  కీలక నేతల ఎదుట భరోసా ఇచ్చారు. కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తా అంటూ హాలియా బహిరంగ సభలోను సైతం సీఎం ప్రకటించారు. ఆ హామీ ఎంత మేరకు అమలవుతుంది,  కోటిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఎంతో మంది నేతలను ఎమ్మెల్సీ చేస్తానని గతంలో సీఎం ప్రకటించగా, కోటిరెడ్డి విషయం కూడా అలానే ఉంటుందా? అందుకు భిన్నంగా ఉంటుందా? అనే చర్చ స్థానికంగా కొనసాగుతోంది. 


రేసులో నేతి, కర్నె, చాడ

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌లో చేరిన సీనియర్‌ నేత విద్యాసాగర్‌కు సీఎం కేసీఆర్‌ మంచి ప్రాధాన్యం కల్పించారు. ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని హామీ మేర కు రెన్యువల్‌ చేస్తూ మండలి వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గం, సీనియర్‌ నేతగా ఆయన్ను పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి గుత్తా, ఎంసీ.కోటిరెడ్డి రేసులో ముందున్నారు. నేతి విద్యాసాగర్‌ వియ్యంకురాలు నిజామాబాద్‌కు చెందిన ఆకుల లలిత కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా ఉండగానే ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. మరో సారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామన్న హామీ మేరకే ఆమె టీఆర్‌ ఎస్‌లో చేరారు. దీంతో బీసీ, మున్నూరుకాపు కావడంతో ఆమెకు రెన్యువల్‌ ఖాయమనే నేపఽథ్యంలో నేతికి అవకాశం దక్కు తుందా? అనే సందేహం ఉంది. ఇక టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న చాడ కిషన్‌రెడ్డి పేరు ఈసారి ప్రముఖంగా వినిపిస్తోంది. 2007 నుంచి చాడ, పార్టీ రాష్ట్ర కార్యదర్మిగా కొనసాగుతున్నారు. గతంలో నల్లగొండ ఎమ్మెల్యే, ఆతరువాత నల్లగొండ ఎంపీ టికెట్‌ రేసులో చివరి వరకు ఉన్నారు. ఉద్యమ సమయంలో చాడపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పార్టీ ఆదేశం మేరకు రాష్ట్రంలో పలు నియో జకవర్గాల్లో అభ్యర్థుల గెలుపునకు ఇన్‌చార్జిగా పనిచేశారు. పార్టీలో సుదీర్ఘ ప్రస్థానం ఉన్నా, ఇప్పటి వరకు చాడకు అవ కాశం రాకపోవడంతో ఆయన పేరు చర్చకు వచ్చింది. గతంలో విప్‌గా పనిచేసిన జిల్లాకు చెందిన కీలక నేత కర్నె ప్రభాకర్‌కు మరోసారి అవకాశం దక్కే అవకాశం ఉందన్న చర్చ ఉంది.


సీఎంను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం

సరిగ్గా నెలరోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండటంతో సీఎంను కలిసి అవకాశం కల్పించాలని విన్నవించుకునేందు కు జిల్లా నేతలు  ప్రయత్నాల మొద లు పెట్టారు. సీఎంకు ఇటీవల కరోనా సోకడంతో ఆయన్ను కలిసే అవకాశం లేకుండాపోయింది.

Updated Date - 2021-05-11T07:00:00+05:30 IST