రైతన్నపై వరుణుడి పోటు

ABN , First Publish Date - 2020-09-21T10:29:27+05:30 IST

రైతన్నపై వరుణుడి పోటు

రైతన్నపై వరుణుడి పోటు

10,647 హెక్టార్లలో పంట నష్టం

రూ.17.54 కోట్ల పంట నష్టం

824 హెక్టార్లలో కోతకు గురైన భూమి 


కడప, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వరుణుడి ఆగ్రహానికి రైతన్న కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాడు. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. సాగు భూములు కోతకు గురై వ్యవసాయానికి యోగ్యం కాకుండా మారిపోయాయి. వేలాది రూపాయలు సాగు పెట్టుబడి పెట్టి కష్టపడ్డ రైతన్న శ్రమ వరుణుడి దెబ్బకు నీళ్లలో కలిసిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు 10,647 హెక్టార్లలో పంట నష్టం పెరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. రూ.17.64 కోట్లు నష్టం సంభవించినట్లు నిర్ధారణకు వచ్చింది. 4534 హెక్టార్లలో వరి పంట దెబ్బతినింది. 824 హెక్టార్ల భూములు కోతకు గురయ్యాయి. జిల్లాలో 372 గ్రామాల్లో 10647.40 హెక్టార్లలో పంటలు దెబ్బతిన ్నట్లు తెలిసింది. పంటల వారీగా పరిశీలిస్తే 4534 హెక్టార్లలో వరి పంట దెబ్బతినింది. 2,745.40 హెక్టార్లలో వేరుశెనగ దెబ్బతింది. మొక్కజొన్న ఏడు గ్రామాల్లో 84.83 హెక్టార్లు, 23 గ్రామాల్లో మినుము 567.57 హెక్టార్లు, మూడు గ్రామాల్లో ఆముదం 10.20 హెక్టార్లు, పత్తి 63 గ్రామాల్లో 2,745.40 హెక్టార్లలో తొమ్మిది ఎకరాల్లో ఒక గ్రామంలో శెనగ పంట దెబ్బతింది. 59 గ్రామాల్లో వేరుశెనగ, 17 గ్రామాల్లో మినుము 1401 హెక్టార్లు, 18  గ్రామాల్లో జొన్న 532 హెక్టార్లు, 16 గ్రామాల్లో కొర్ర 458.80 హెక్టార్లు, 7 గ్రామాల్లో మొక్కజొన్న 38.40 హెక్టార్లలో దెబ్బతింది. పొద్దుతిరుగుడు ఒక గ్రామంలో 18 హెక్టార్లు, కందులు 9 గ్రామాల్లో 68.04 హెక్టార్లు, చెరుకు ఒక గ్రామంలో 8 హెక్టార్లు దెబ్బతింది. వ్యవసాయశాఖ పంటల వారీగా ఎంత నష్టం జరిగిందీ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతోంది.


Updated Date - 2020-09-21T10:29:27+05:30 IST