
అమరావతి (Amaravathi): టీడీపీ అధినేత చంద్రబాబు (Tdp Chief Chandrababu) సమక్షంలో గన్నవరం (Gannavaram) నియోజకవర్గం రామవరప్పాడు (Ramavarappadu)కు చెందిన బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ తన తరువాత జగన్ (Jagan) లాంటి వ్యక్తి సీఎంగా వచ్చి ఉంటే నాడు హైదరాబాద్ (Hyderabad)ను ఏం చేసేవాడోనని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్‌లా ఏపీ (Ap)కి అమరావతి (Amaravathi) ఉండాలని భావించానని చెప్పారు. విజన్‌తో చేసిన పాలన కారణంగానే హైదరాబాద్ నేడు ఉన్నత స్థానంలో ఉందని చంద్రబాబు గుర్తు చేశారు.
ఇప్పుడు ఏపీలో అన్నీ కూల్చేస్తున్నా, ప్రాజెక్టులు ఆపేస్తున్నా జగన్ లాంటి వాళ్లు....2004లో తన అనంతరం సీఎం అయ్యి ఉంటే హైదరాబాద్ ఏమయ్యి ఉండేదోనని చంద్రబాబు అన్నారు. హైటెక్ సిటీ, ఐఎస్బీ లాంటి వాటిని కూల్చేసి, ఎయిర్ పోర్ట్, రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులను అపేసి ఉండేవారేమోనని ఎద్దేవా చేశారు. ఉడతల కారణంగా కరెంట్ తీగలు తెగిపోవడం, ఎలుకలు మద్యం తాగడం, ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఉద్యోగుల అకౌంట్ల నుంచి మాయం అవడం ఈ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమని విమర్శించారు. తెలంగాణ(Telangana)లో 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు పాస్ అయితే.....ఏపీలో కేవలం 67 శాతం మంది మాత్రమే పాస్ అవ్వడమే నాడు నేడు కార్యక్రమమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి