దిశ బిల్లును కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-03T15:52:09+05:30 IST

ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు గురువారం ప్రారంభమయ్యాయి.

దిశ బిల్లును కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభలో దిశ బిల్లును సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దిశ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పలు కొర్రీలు వేయడంతో బిల్లులో అధికారులు సవరణలు చేశారు. అయితే దీనిపై చర్చకు టీడీపీ సభ్యులు కోరగా.. స్పీకర్ తమ్మినేని సీతారాం అవకాశం ఇవ్వలేదు. స్పీకర్‌తో వాగ్వాదానికి దిగిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.


భూ యాజమాన్యం హక్కుల చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. అయితే టీడీపీ డిమాండ్‌ను పట్టించుకోలేదు. అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. దీంతో మరోసారి సభ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది.


కాగా మహిళలపై అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులను, వివిధ రూపాల్లో ఎదురయ్యే హింసలను అరికట్టేందుకు, కేసులను సత్వరమే విచారించి దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు 2012లో కేంద్రం నిర్భయ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-12-03T15:52:09+05:30 IST