ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-24T15:02:13+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. నేడు అసెంబ్లీలో  ఏపీ సర్కార్ 9 బిల్లులను పెట్టనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, బీసీ జనగణనపై సభలో చర్చించనున్నారు. అలాగే ఆరోగ్య రంగంపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అటు మండలిలో 11 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్ సంస్కరణలపై, రాష్ట్రంలో రోడ్లు-రవాణా పరిస్థితిపై  స్వల్పకాలిక చర్చ జరుగనుంది. 

Updated Date - 2021-11-24T15:02:13+05:30 IST