AP Assembly: 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మళ్లీ మూడు రాజధానుల బిల్లు?

ABN , First Publish Date - 2022-09-01T21:55:38+05:30 IST

ఈనెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP Assembly: 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మళ్లీ మూడు రాజధానుల బిల్లు?

అమరావతి (Amaravathi): ఈనెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు (Meetings) నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు (Three capitals Bill) పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 7న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కేబినెట్ అజెండా (Cabinet Agenda)ను నిర్ణయించే అవకాశముంది. అయితే గత నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని వ్యూహాలతోనే దీన్ని వాయిదా వేసింది. ఈ నెల మూడో వారం అంటే 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు రాజధానుల బిల్లు మళ్లీ ప్రవేశపెట్టే అంశంపై 7న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గతంలో హైకోర్టు (High Court) తీర్పు ఇచ్చింది. దానిపై రివ్యూ పిటిషన్ (Review Petition) వేసే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు అడ్వకేట్ జనరల్ (AG) ఇటీవల హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు చెప్పారు.

Updated Date - 2022-09-01T21:55:38+05:30 IST