చెరువులు, కుంటల ఆక్రమణలపై ఏపీ అసెంబ్లీలో చర్చ

ABN , First Publish Date - 2021-11-25T16:33:26+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి.

చెరువులు, కుంటల ఆక్రమణలపై ఏపీ అసెంబ్లీలో చర్చ

మ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రివెన్యూశాఖ‌కు చెందిన చెరువులు, కుంట‌లు ఆక్ర‌మ‌ణ‌లకు సంభందించి ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో చ‌ర్చ‌ చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి సభలో మాట్లాడుతూ.... అనేక ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంట‌లు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌వుతున్నందున నేడు వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయని అన్నారు. ఆక్ర‌మ‌ణ‌కు గుర‌య్యాయని అడిగితే అవును అని మంత్రి చెపుతున్నారని తెలిపారు.


శాఖాప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామని రోటీన్‌గా స‌మాధానం ప్ర‌తీసారి చెపుతున్నారని... దీనికి సంభ‌దిత జిల్లా క‌లెక్ట‌ర్లు, సూప‌రేండెంట్ ఇంజ‌నీర్ల‌ను బాధ్యులను చేస్తామ‌ని సుప్రీంకోర్టు చెప్పానా పట్ట‌న‌ట్టు వ్య‌వ‌హరిస్తున్నారని అన్నారు. ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతుంటే గ్రామాల్లో ఉన్న వీఆర్వోలు, స‌ర్వేయ‌ర్ల సేవ‌లను ఎంద‌కు వినియోగించుకోవ‌డం లేదని ప్రశ్నించారు. రివెన్యూ, పంచాయితీల‌లో ఉన్న‌ కుంట‌లను స‌దుద్దేశంతో పూర్వీకులు ఏర్పాటు చేశారని చెప్పారు. వీటిన ప్రైవేటు వ్య‌క్తుల పేర్ల‌పై వెబ్ పోర్టింగ్ చేసేశారని అన్నారు. అలా చేసిన అధిక‌రుల‌పై ఎలంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో చెప్పాలని ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ప్రశ్నించారు. 


మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాసు సమాధానమిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా 1216 గ్రామాల్లో 5236ఎక‌రాలు ఆక్ర‌మ‌ణల‌కు గుర‌య్యాయయని తెలిపారు. వెయికోట్ల రూపాయ‌ల‌తో 3 ద‌శ‌ల్లో స‌ర్వే చేయిస్తున్నామని... ఇది పూర్త‌యితే ఈ స‌మ‌స్య‌ల్లో చాలా వ‌ర‌కూ ప‌రిష్కారం అవుతాయని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-25T16:33:26+05:30 IST