ఏడవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Nov 26 2021 @ 09:21AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు ప్రారంభమయ్యాయి.  నేడు 2020 మార్చ్31 నాటికి ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక నివేదికను (కాగ్ నివేదికను) ఉభయసభల్లో  ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యా వ్యవస్థపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. మండలిలో మధ్యాహ్నం 12:30 కు డిప్యూటీ చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. మండలిలో రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలపై స్వల్పకాలిక చర్చతో పాటు,   రాష్ట్రంలో రోడ్లు, ఇతర రవాణా సదుపాయాలపై చర్చ జరుగనుంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.