YCP Vs TDP: ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం... వాయిదా

ABN , First Publish Date - 2022-09-21T15:59:58+05:30 IST

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ మొదలైన వెంటనే టీడీసీ సభ్యులు ఆందోళనకు దిగారు.

YCP Vs TDP: ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం... వాయిదా

అమరావతి: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో అధికార (YCP), విపక్ష (TDP) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీసీ సభ్యుల ఆందోళనతో స్పీకర్ తమ్మినేని సీతారం సభను కాసేపు వాయిదా వేశారు. ఈరోజు ఉదయం సభ మొదలైన వెంటనే ఎన్టీఆర్ వర్సిటీ (NTR Health university) పేరు మార్చొద్దంటూ టీడీపీ సభ్యులు(TDP Leader) ఆందోళనకు దిగారు.  కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు మేము మార్చామా అంటూ  నిరసన చేపట్టారు. రాజకీయంగా ఈ స్థానంలో కూర్చున్నారంటే దానికి ఎన్టీఆర్ (NTR) కారణం అంటూ స్పీకర్‌తో టీడీపీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్ హర్టీ కల్చర్ యూనివర్సిటీ పేరు మార్చామా అంటూ ఆందోళన చేపట్టారు.


అయితే... టీడీపీ సభ్యులు పోడియం వద్ద నుంచి వెనెక్కి వచ్చి అడగాలని మంత్రి అంబటి(Ambati rambabu) సూచించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లును వెనెక్కి తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఎన్టీఆర్ జోహర్... ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ గురిచి మాట్లాడే  హక్కు కేవలం బుచ్చియ్య చౌదరి కే ఉందని మంత్రి అంబటి రాంబాబు(AP Minister) అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి (Srikanth reddy) మధ్యలో మాట్లాడుతూ... ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. జిల్లా పేరు కూడా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టామని చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ఆర్ (YSR) ఆరోగ్యశ్రీతో పాటు వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని... అందుకే ఆయన పేరు తీసుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి(YCP MLA) వివరణ ఇచ్చారు. 


మీరు జగన్‌ను ఏమీ పీకలేరన్న డిప్యూటీ సీఎం....

టీడీపీ సభ్యుల ఆందోళనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Narayana swamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తమరు అంగీకరించలేదన్నారు. ‘‘మీరు విశ్వసఘాతకులు, మీకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అని అన్నారు. 22 మంది వచ్చి కిందకు పైకి ఎగురుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు జగన్మోహన రెడ్డి (Jagan mohan reddy)ని ఏమీ పీకలేరు అంటూ నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు. సభలో టీడీపీ సభ్యులు ఆందోళనలతో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ (AP Assembly speaker) సభను కొంత సమయం వాయిదా వేశారు. 

Updated Date - 2022-09-21T15:59:58+05:30 IST