వర్సిటీల్లో బీసీ ఉద్యోగులపై అణిచివేత

ABN , First Publish Date - 2021-04-17T06:00:13+05:30 IST

విశ్వవిద్యాలయాల్లో బీసీ ఉద్యోగులు అణచివేతకు గురవుతున్నారని, కొందరు ఉద్యోగులు ప్రమోషన్లకు దూరం అవుతున్నారని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విమర్శించారు.

వర్సిటీల్లో బీసీ ఉద్యోగులపై అణిచివేత
ప్రసంగిస్తున్న కేసన శంకరరావు

ఏళ్ళ తరబడి భర్తీకి నోచుకోని ఉద్యోగాలు

బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు

పెదకాకాని, ఏప్రిల్‌16: విశ్వవిద్యాలయాల్లో బీసీ ఉద్యోగులు అణచివేతకు గురవుతున్నారని, కొందరు ఉద్యోగులు ప్రమోషన్లకు దూరం అవుతున్నారని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విమర్శించారు. శుక్రవారం  ఏఎన్‌యూకు వచ్చిన ఆయన మాట్లాడుతూ  ఏళ్ళ తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడంలేదన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన పదవుల  నియామకాల్లో బీసీలకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు అమలు పరచడం లేదని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విఽభాగాలలో ఇదే తంతు నడుస్తుందన్నారు. టీచింగ్‌, నాన్‌టీచింగ్‌, ల్యాబ్‌ టెక్నిషియన్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు. అనంతరం వీసీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, పరసా రంగనాథ్‌, ఎన్‌.రాజశేఖర్‌, కె.సుబ్రహ్మణ్యం, వేముల శివ, సువర్ణగంటి శివ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T06:00:13+05:30 IST