ఏపీ బీజేపీ కోర్ కమిటీ ప్రకటన

Nov 29 2021 @ 19:33PM

అమరావతి: రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కోర్ కమిటీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్  ప్రకటించారు. ఈ కమిటీలో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సత్యకుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. ఎంపీలు  సీఎం రమేష్, సుజనా చౌదరి,  టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులను కూడా సభ్యులుగా నియమించింది. కోర్‌ కమిటీలో మధుకర్, మాధవ్, జయరాజు, చంద్రమౌళి, రేలంగి శ్రీదేవిలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా శివప్రకాష్‌‌ను  నియమించింది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.