
అమరావతి: తిరుపతి ఉప ఎన్నికలపై హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ కీలక సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధరన్‌తో సోము వీర్రాజు, ముఖ్యనేతలు భేటీ అయ్యారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర నేతలు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. జనసేన నుంచి అభ్యర్థి ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్‌తో భేటీ అంశాలపై పార్టీ ముఖ్యనేతలు సమావేశమై చర్చిస్తునట్లు సమాచారం. బైపోల్స్ అభ్యర్థిపై ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.