Cabinet meeting: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-07T17:00:51+05:30 IST

: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది.

Cabinet meeting: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet meeting) సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి (CM Jagan mohan reddy) అధ్యక్షతన సచివాలయంలోని బ్లాక్ వన్‌లో సమావేశం జరుగుతోంది. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. కడప జిల్లా కొప్పర్తిలో 386.23 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కాసిస్‌ ఇ – మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌కు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం  ఉంది. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో 1900 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న లైఫిజ్‌ ఫార్మాకు  మంత్రి మండలి (Cabinet) పచ్చ జెండా ఊపనుంది. మెటలార్జికల్‌ గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్,  తయారీ పరిశ్రమతో పాటు సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ఇండోసోల్‌ సోలార్‌ సంస్థ  ఏర్పాటు చేయనుంది. అలాగే  నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతో పాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పనున్న ఇండోసోల్‌ సోలార్‌ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది.


అటు కృష్ణా జిల్లా మల్లవల్లిలో అవిశా ఫుడ్స్ మెగా ఫుడ్‌పార్క్‌‌పై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే కడప జిల్లా వొంగిమల్ల వద్ద అస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ సంస్థ  ఆధ్వర్యంలో 1800 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు పై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. సోమశిల, ఎర్రవరం వద్ద రెండు పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై క్యాబినెట్ చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంప్డ్, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటుకు గ్రీన్‌కోకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-09-07T17:00:51+05:30 IST