ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు వెనుక అసలు ఉద్దేశమేంటి?

ABN , First Publish Date - 2021-12-14T01:58:59+05:30 IST

తమను విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు వెనుక అసలు ఉద్దేశమేంటి?

అమరావతి/హైదరాబాద్: తమను విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో రెండో(ఏ2) నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలకు వెళ్లినప్పుడు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మరో ముగ్గురు తమ విధులకు ఆటంకం కల్పించారంటూ దర్యాప్తు బృందం ఇంచార్జిగా ఉన్న సీఐడీ సీఐ శనివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఎఫ్‌ఐ‌ఆర్ కాపీని గుంటూరులోని 6వ ఎంఎం కోర్టుకు సీఐడీ పంపింది. తదుపరి చర్యల కోసం హైదరాబాద్‌లోని జూబ్లీహీల్స్ పోలీస్ స్టేషన్‌కు పంపుతోంది. ఈ ఎఫ్ ఐ ఆర్ నమోదు వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.


సీఐడీ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లింది - శుక్రవారం ఉదయం; మధ్యాహ్నం మూడింటి తర్వాత అస్వస్థత కారణంగా ఆయనను హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రికి సీఐడీ బృందం విజయవాడకు చేరుకుంది. ఫిర్యాదు ఇచ్చింది శనివారం రాత్రి ఏడు గంటలకు ఎస్ఎఆర్ నమోదు చేసింది రాత్రి తొమ్మిదింటికి. ఈ మధ్యలో ఏమి జరిగిందన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ జర్నలిస్టుగా ఉన్న కాలం నుంచే ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆయనకు మిత్రుడు. ఆయన ఇంటి వద్ద హడావుడి నడుస్తుండటంతో పరామర్శ కోసం వెళ్లారు. సీఐడీ అధికారులు కూడా ఆయనను గుర్తించి కొంచెం సేపు ఉంటే తమ విచారణ సులువు అవుతుందని అభ్యర్థించారు. ఆ మేరకే ఆయన అక్కడున్నారు.


ఒక వేళ తాజాగా నమోదైన ఎఫ్‌ఐ‌ఆర్ ప్రకారం రాధాకృష్ణ ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు సీఐడీ అధికారులను అడ్డుకొని ఉంటే ఆ విషయాన్ని అప్పటికప్పుడే వారు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండే వారు. అంతెందుకు, వారి కోరిక మేరకే జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి కొందరు సిబ్బంది వారికి సహకరించేందుకు లక్ష్మీ నారాయణ ఇంటికెళ్లారు. అక్కడెక్కడా ఈ అడ్డుకునే ప్రస్తావన రాలేదు. సాయంత్రం వరకూ అన్నీ సాఫీగానే జరిగిపోయాయి. అంతసేపూ అక్కడున్న రాధాకృష్ణను ఏపీ సీఐడీ అధికారులు గౌరవంగానే మాట్లాడి ధన్యవాదాలు కూడా చెప్పారు. కానీ ఆ తర్వాతే కథ మారిపోయింది. జగన్ మీడియాలో ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో రాధాకృష్ణ సీఐడీ దర్యాప్తునకు అడ్డం పడ్డారంటూ కథలు వండి వార్చారు. అంటే ప్రభుత్వ పెద్దలు దీనికి సంబంధించి తమ సొంత స్కెచ్ ను ముందే వేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణ ఇంట్లో రాధాకృష్ణ ఉన్నంత సేపూ సానుకూలంగానే ఉన్నారు కానీ ఫిర్యాదు మాత్రం చేయలేదు. అదే రోజు రాత్రికి విజయవాడకు తిరిగొచ్చారు. అప్పుడైనా ఫిర్యాదు చేయాల్సింది. రాత్రి ఆలస్యం అయిందనుకున్నా శనివారం ఉదయం ఉన్నతాధికారులకు తెలియజేసి కేసు నమోదు చేసి ఉండాల్సింది. కానీ ఇవేవీ జరగలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో శనివారం రాత్రి ఫిర్యాదు రాయించుకుని కేసు నమోదు చేశారన్న మాట. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను ఎవరైనా అడుకుంటే అప్పటికప్పుడే కేసులు నమోదు చేస్తారు తప్ప ముప్పై గంటల తర్వాత కేసు నమోదు చేయడం వెనుక జరిగిన తతంగం ఏమీటో అందరికీ స్పష్టంగా అర్థం అవుతోంది.



ఈ నేపథ్యంలో ‘‘ఏపీ సీఐడీని ఆర్కే అడ్డుకుంటే అప్పుడే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదెందుకు?. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు వెనుక అసలు ఉద్దేశమేంటి?. మనస్సాక్షిలేని సాక్షి రాతలు నిజమని చెప్పే ప్రయత్నమా?. నీలి రాతలు-కూలి అరుపులు.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-12-14T01:58:59+05:30 IST