Varupula Raja: జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ నేత వరుపుల రాజా కోసం సీఐడీ గాలింపు
ABN , First Publish Date - 2022-08-15T21:58:13+05:30 IST
జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ నేత (TDP Leader) వరుపుల రాజా (varupula raja) కోసం సీఐడీ (CID) గాలిస్తోంది. మాజీ డి.సి.సి.బి చైర్మన్ ప్రత్తిపాడు (prathipadu) నియోజకవర్గ..
కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ నేత (TDP Leader) వరుపుల రాజా (varupula raja) కోసం సీఐడీ (CID) గాలిస్తోంది. మాజీ డి.సి.సి.బి చైర్మన్ ప్రత్తిపాడు (prathipadu) నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ వరుపుల రాజా కోసం ఈరోజు ఉదయం నుంచి సీఐడీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. నియోజకవర్గంలో 4 మండలాల కీలక నేతలు ఇంటి దగ్గర అధికారులు జల్లెడ పడుతున్నారు. దీంతో.. నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు, కార్యకర్తలు భయాందోళనలో ఉన్నారు.
గత సోమవారం సీఐడీ సీఐ రమేష్ (CID CI Ramesh) బృందం ప్రత్తిపాడులోని వరుపుల రాజా నివాస, కార్యాలయ పరిసరాలకు వెళ్లింది. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో వరుపుల రాజాపై నమోదైన కేసుకు సంబంధించి, గండేపల్లి సొసైటీలో జరిగిన అవకతవకల కేసులో రాజాను అరెస్ట్ చేసేందుకు ఇటీవల సీఐడీ అధికారులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కోసం సీఐడీ నిఘా వేసింది.