దావోస్‌లోనూ అదే భావ దారిద్ర్యమా?

ABN , First Publish Date - 2022-05-24T01:20:16+05:30 IST

ఏపీ సీఎం జగన్ దావోస్‌లో పర్యటించారు. ఫ్యూచర్ ఫ్రూపింగ్ హెల్త్ సిస్టమ్‌పై జగన్ ప్రసంగించారు. అయితే ..

దావోస్‌లోనూ అదే భావ దారిద్ర్యమా?

అమరావతి/హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ దావోస్‌లో పర్యటించారు. ఫ్యూచర్ ఫ్రూపింగ్ హెల్త్ సిస్టమ్‌పై జగన్ ప్రసంగించారు. అయితే జగన్ మళ్లీ అదే ఆవు కథ వినిపించారు. ఏపీలో తెలుగులో.. దావోస్‌లో ఇంగ్లీష్‌లో సేమ్ కంటెంట్ చదివారు. గత మూడేళ్లలో ఆరోగ్య శ్రీ కింద 25 లక్షల మందికి వైద్యం అంటూ అంతర్జాతీయ వేదికపై డబ్బా కొట్టారు. గడిచిన 3 నెలలుగా పెండింగ్‌లో రూ.600 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు ఉన్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆస్పత్రి అంటూ వేదికపై వెల్లడించారు. వీటిలో 9 ఆస్పత్రులకు టెండర్లు పదేపదే పిలుస్తున్నా ఎవరూ ముందుకురాని పరిస్థితి ఉంది.  ఆరోగ్యశ్రీ కింద 2,446 ప్రొసీజర్లు అమలు చేస్తున్నాం అంటూ జగన్ వ్యాఖ్యానించారు.  వాస్తవానికి బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీని ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి.  కరోనా సమయంలో 44 సార్లు ఇంటింటి సర్వే, ఏపీలో కరోనా మరణాల రేటు తక్కువ అంటూ సీఎం జగన్ వెల్లడించారు. సెకండ్ వేవ్‌లో శ్మశానాల దగ్గర క్యూ, మరణాలను ఏపీ సర్కార్ దాచిపెట్టింది.  ఇప్పటివరకు కోటి 44 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామన్న ఏపీ ప్రభుత్వం.. బిల్లుల చెల్లింపు సకాలంలో లేకపోవడంతో వీటి ఉపయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 


ఈ నేపథ్యంలో ‘‘దావోస్‌లోనూ అదే భావ దారిద్ర్యమా?. ఏ దేశమేగినా అబద్ధాల పాఠమేనా?. ఏపీలో ఎన్ని మెడికల్ కాలేజీలున్నాయి?. అసలు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ అమలవుతోందా?. ఏపీలో వైద్యానికి బీమా సదుపాయం ఉందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 






Updated Date - 2022-05-24T01:20:16+05:30 IST