ఏపీలో ఒక్క కంపెనీతోనే రెండున్నర వేల కోట్ల మద్యం అమ్మారా?

ABN , First Publish Date - 2022-07-12T01:07:48+05:30 IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Am Cm Jagan Mohan Reddy) అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో ..

ఏపీలో ఒక్క కంపెనీతోనే రెండున్నర వేల కోట్ల మద్యం అమ్మారా?

అమరావతి/హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohan Reddy) అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు వచ్చాయి. కనుచూపు మేర పాత బ్రాండ్లు కనిపించలేదు. ఆంధ్రా గోల్డ్, స్పెషల్ స్టేటస్ లాంటి కొత్త కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చారు. అంతేకాదు రేట్లు విపరీతంగా పెంచారు. మద్యం అధిక రేట్లు ఉంటే ప్రజలు తాగడం తగ్గిస్తారని ప్రభుత్వం చెప్పింది. మద్యం రేట్లు ఎక్కువగా చేసినా సరే లాభాలు మాత్రం బాగా వచ్చాయి. ఆ తర్వాత మద్యం రేట్లు కాస్త తగ్గించి అమ్ముతున్నారు.  అయితే ఈ మద్యం బ్రాండ్లు తీసుకురావడంలో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన బంధువులు పాత్ర ఉందని సమాచారం. వాళ్లే బినామీల పేర్లతో మద్యం డిస్టిలరీలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలో ‘‘ఏపీలో మద్యం ఏలిన వారి తయారీయేనా?.లీజ్డ్ డిస్టిలరీలలో బినామీ లిక్కర్ దందానా?.అదాన్ డిస్టిలరీ అల్లుడుగారిదేనంటగా?. ఒకే అడ్రస్ పైనున్న 19 కంపెనీలు సూట్కేస్ కంపెనీలేనా?. ఒక్క కంపెనీతోనే రెండున్నర వేల కోట్ల మద్యం అమ్మారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-07-12T01:07:48+05:30 IST