జగనన్న ఝలక్.. ఉద్యోగుల స్వయంకృత అపరాధమేనా..?

ABN , First Publish Date - 2021-12-15T01:43:47+05:30 IST

పీఆర్సీపై అధికారుల కమిటీ రికమెండ్ చేసిన మొత్తాన్ని మించి ప్రభుత్వం భరించే స్థితిలో లేదని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో..

జగనన్న ఝలక్.. ఉద్యోగుల స్వయంకృత అపరాధమేనా..?

అమరావతి: పీఆర్సీపై అధికారుల కమిటీ రికమెండ్ చేసిన మొత్తాన్ని మించి ప్రభుత్వం భరించే స్థితిలో లేదని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయిన తర్వాత పీఆర్సీపై ఆయన కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వడం లేదన్నారు. అక్కడ రికమెండెషన్స్ అమలు చేయకుండా వాయిదా వేస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు. ఉద్యోగులు సీఎంని కలిసే ముందే మార్గాన్ని సుగమం చేస్తామని సజ్జల తెలిపారు. 


సీపీఎస్ విషయంలో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీపీఎస్‌ నుంచి బయటకు వస్తే వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఫైనాన్స్‌కు సంబంధంలేని 71 డిమాండ్లను అధికారులు తేల్చేస్తారని సజ్జల తెలిపారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందేనన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి సుప్రీంకోర్టు తీర్పు అవరోధం అయ్యిందన్నారు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సి ఉందని సజ్జల  పేర్కొన్నారు


ఈ నేపథ్యంలో ‘‘ ఉద్యోగుల జీతాలకు ప్రభుత్వ ఆదాయానికి లింకేంటి?. ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం తప్ప ఆదాయం ఎక్కడుతుంది?. అప్పులు చేయడం తప్ప ఆదాయం పెంచే ఆలోచనేది..?. ప్రభుత్వానికి క్రమ శిక్షణ లేక ఉద్యోగులకు శిక్షా?. గత ప్రభుత్వంతో పోలిస్తే ఉద్యోగుల సమాధానం చెప్పగలరా..?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.  



Updated Date - 2021-12-15T01:43:47+05:30 IST