Ap Cm Jaganపైకి టీచర్లను ఉసిగొల్పుతున్నది ఎవరు?

ABN , First Publish Date - 2022-09-06T02:20:36+05:30 IST

ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవాన్నియూటీఎఫ్...

Ap Cm Jaganపైకి టీచర్లను ఉసిగొల్పుతున్నది ఎవరు?

విజయవాడ: ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవాన్నియూటీఎఫ్ (UTF), ఏపీటీఎఫ్ (APTF), సీపీఎస్ (CPS) ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. సీపీఎస్‌ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేవారు. 


సీపీఎస్‌ ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ దినోత్సవానికి దూరంగా ఉండాలని ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్యూఎస్‌ పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాచారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల అప్పలరాజు మాట్లాడుతూగత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అనేక శాంతియుత ఉద్యమాల ద్వారా సీపీఎస్‌ జీవో రద్దు కోసం డిమాండ్‌ చేశామన్నారు. సమాజం ఇబ్బంది పడేలా ఎప్పుడూ తాము నిరసన కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. పోలీసుల అనుమతితోనే శాంతియుతంగా నిర్వహించామని తెలిపారు. సెప్టెంబరు 1న చలో విజయవాడ పేరుతో మిలియన్‌ మార్చ్‌కు అనుమతి కోరుతూ దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తామని గానీ, ఇవ్వబోమని గానీ పోలీసులు చెప్పలేదన్నారు. పోలీసులు నిర్ణయం చెప్పకుండానే సీపీఎస్‌ ఉద్యోగులపై కేసులు పెట్టి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పి భయబ్రాంతులకు గురి చేశారన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా మిలియన్‌ మార్చ్‌ను వాయిదా వేశామని తెలిపారు. అయినా సీపీఎస్‌ ఉద్యోగులపై బైండోవర్‌ కేసులు, ఎఫ్‌ఐఆర్‌ 41 వంటి రకరకాల కేసులతో వేధిస్తున్నారని.. ఇప్పటికీ కేసులు పెడుతున్నారని రొంగల అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 



ఈ నేపథ్యంలో ‘‘ఏపీ సీఎం జగన్‌పైకి టీచర్లను ఉసిగొల్పుతున్నది ఎవరు?. గురువులను నిత్యం పూజించే జగన్‌ను అభినందించరు ఎందుకు?.  టీచర్లకు ఇప్పుడున్నంత గౌరవం గతంలో కన్నారా..? విన్నారా..?.  నాలుగు రోజులు జీతాలు లేటయితే ఇంత రాద్ధాంతమా?, బడికి వెళ్లి సెల్ఫీ ఫొటోలు పంపమంటే కూడా నొప్పేనా..?’’ అనే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-09-06T02:20:36+05:30 IST