ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 18 ఏళ్లు దాటిన వారికి ఉచిత వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-04-23T23:06:31+05:30 IST

ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 18 ఏళ్లు దాటిన వారికి ఉచిత వ్యాక్సిన్

గుంటూరు: ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. మే 1 నుంచి 18- 45 వయసు వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని సీఎం చెప్పారు. ఏపీలో 18-45 మధ్య వయసువారు 2,04,70,364 మంది ఉన్నారని పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే, ఏపీలో శనివారం నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించారు. ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌, ఉచిత వ్యాక్సిన్‌ కోసం రూ.1600 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కరోనా కట్టడిపై సీఎం జగన్‌ విస్తృతంగా చర్చించారని ఆళ్లనాని తెలిపారు. వ్యాక్సిన్‌ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆళ్లనాని అన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాలని సీఎం ఆదేశించారని, సిటీ స్కాన్‌కు ధరలు నిర్ణయించాలని సీఎం ఆదేశించారని ఆళ్లనాని చెప్పారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఆళ్లనాని తెలిపారు.

Updated Date - 2021-04-23T23:06:31+05:30 IST