కొత్త పీఆర్సీతో వేతనాలు తగ్గవు: ఏపీ సీఎస్

ABN , First Publish Date - 2022-01-19T21:50:41+05:30 IST

కొత్త పీఆర్సీతో ఉద్యోగుల వేతనాలు తగ్గవని రాష్ట్ర ప్రభుత్వ

కొత్త పీఆర్సీతో వేతనాలు తగ్గవు: ఏపీ సీఎస్

అమరావతి: కొత్త పీఆర్సీతో ఉద్యోగుల వేతనాలు తగ్గవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పీఆర్సీ పై క్లారిటీ ఇచ్చారు. ఐఆర్ అంటే వేతనంలో భాగం కాదన్నారు. ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కష్ట కాలంలోనూ ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు. 


10 ఏళ్లకు ముందు తాను పీఆర్సీ పై అధ్యయనం చేసానన్నారు. అప్పటి రెవిన్యూ, ఇప్పటి రెవెన్యూకు చాలా తేడా ఉందన్నారు. 17,000 కోట్లు మేర మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఒక్క ఉద్యోగి జీతంలో గ్రాస్ శాలరీలో తగ్గుదల ఉండదన్నారు. సాలరీ కాపోనెంట్‌లో కొన్ని తగ్గొచ్చు కొన్ని పెరగొచ్చన్నారు. పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచడం వల్ల ఉద్యోగాలు తగ్గుతాయనడంలో నిజం లేదన్నారు. 2008-09లో  పీఆర్సీ ప్రక్రియలో పాల్గొన్నానన్నారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో తేడా వచ్చిందన్నారు. కరోనా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. వాస్తవానికి 98 వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉందన్నారు. పీఆర్సీ ఆలస్యం అయిన కారణంగా మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. 2019 నుంచి గణించి డీఏలు చెల్లింపు తదితర అంశాలను ప్రకటించామన్నారు. మొత్తంగా వేతనం ఎలా ఉందని చూడాలే తప్ప పూర్తిగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.


 పెన్షన్‌లో, గ్రాట్యుటీలో కూడా పెరుగుదల ఉందన్నారు. కేంద్రం విధానాన్ని ఏపీ కూడా అనుసరించిదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కెలు వర్తింప చేస్తున్నామన్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యలోటు 54, 370 కోట్లుగా ఉందన్నారు. ఉద్యోగ నియామకాలు ఉండవన్న ఆరోపణలు సరికావన్నారు. గ్రామ, వార్డు సచివాలయంలో 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. అలాగే వైద్యారోగ్య శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. 23 రికమెండషన్స్‌లో 18 అంశాలను అధికారుల కమిటీ ఉన్నది ఉన్నట్టు అంగీకరించారని ఆయన తెలిపారు. సమీర్ శర్మ కమిషన్‌ను రికమెండేషన్స్ పక్కన పెట్టలేదన్నారు. అవి రికమెండషన్స్ మాత్రమే అని, వాటిని అంగీకరించొచ్చు, లేదా అంగీకరించక పోవచ్చని ఆయన పేర్కొన్నారు. 

 

కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రిని అంటారన్నారు. అలాగే ఉద్యోగులు బాధతో అన్న మాటలను తాను పడతానన్నారు. అందులో తప్పులేదని సమీర్ శర్మ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-19T21:50:41+05:30 IST