AP CSతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల భేటీ

ABN , First Publish Date - 2022-06-30T20:30:27+05:30 IST

సీఎస్ సమీర్‌శర్మతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గురువారం భేటీ అయ్యారు.

AP CSతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల భేటీ

అమరావతి: సీఎస్ సమీర్‌శర్మ(sameer sharma)తో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గురువారం భేటీ అయ్యారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డెబిట్ కావడంపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ(Suryanarayana) మీడియాతో మాట్లాడుతూ... సాంకేతిక కారణాలతో నగదు డెబిట్ అయినట్లు అధికారులు చెప్తున్నారని...ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదని సీఎస్‌కు చెప్పామన్నారు. ఉద్యోగులను చిన్న పిల్లల మాదిరిగా చూస్తున్నారని అన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ సంఘాల నేతలు అబద్ధం చెప్పారని ఆయన మండిపడ్డారు.


నగదు డెబిట్‌పై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘‘మా అనుమతి లేకుండా మా అకౌంట్‌ల నుంచి డబ్బులు తీయడం నేరం’’ అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణ పూర్తిగా అవాస్తవమని తెలిపారు. డీఏ బకాయిల చెల్లింపుపై గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. డీఏ బకాయిలతోనే జీతాలు పెరిగినట్లు చెప్పారని అన్నారు. న్యాయనిపుణులతో సంప్రదింపుల తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని సూర్యనారాయణ వెల్లడించారు. 

Updated Date - 2022-06-30T20:30:27+05:30 IST