హెచ్‌ఆర్‌ఏపై ఉత్తర్వులు ఇవ్వొద్దు: ఏపీ ఉద్యోగ సంఘాలు

Published: Wed, 12 Jan 2022 22:16:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హెచ్‌ఆర్‌ఏపై ఉత్తర్వులు ఇవ్వొద్దు: ఏపీ ఉద్యోగ సంఘాలు

అమరావతి: హెచ్‌ఆర్‌ఏ అంశంపై ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ సీఎంవో దగ్గర ఉదయం నుంచి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు పడిగాపులు కాశారు. ఉదయం నుంచి 2 దఫాలు చర్చలు జరిపినా వ్యవహారం కొలిక్కిరాలేదు. గురువారం మధ్యాహ్నం వరకూ సమయం ఇవ్వాలంటూ ఇరు జేఏసీల ఐక్యవేదికను సీఎంవో అధికారులు కోరారు. సీఎంతో మాట్లాడి తమ నిర్ణయం తెలియజేస్తామని సీఎంవో అధికారుల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నంలోగా సీఎంవో అధికారులు హెచ్‌ఆర్ఏపై ఏమీ తేల్చకపోతే స్ట్రగుల్‌ కమిటీ భేటీ నిర్వహిస్తామన్నారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.