
అమరావతి: ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన మంత్రుల కమిటీ .. ఐఆర్ రికవరీ చేయబోమని స్పష్టం చేసింది. మట్టి ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సుముఖత వ్యక్్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ వేతనం ఇస్తామని చెప్పింది. చర్చించాల్సిన అంశాలను ఆనామలీస్ కమిటీకి పంపిస్తామని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. ఉద్యోగసంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు కొనసాగుతున్నాయి. హెచ్ఆర్ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చింది. 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 8 % హెచ్ఆర్ఏ, 2 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 9.5 % హెచ్ఆర్ఏ , 5 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.12 వేల సీలింగ్‌తో 13.5 % హెచ్ఆర్ఏ, 10 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.15 వేల సీలింగ్‌తో 16 % హెచ్ఆర్ఏ, 25 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.20 వేల సీలింగ్‌తో 16 % హెచ్ఆర్ఏ, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్‌తో 24 % హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేసింది.
ఇవి కూడా చదవండి