ఉద్యోగులకు నిరాశ మిగిల్చిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-07T23:00:01+05:30 IST

ఫిట్‌మెంట్‌ విషయంలో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ద్వజమెత్తుతున్నారు.

ఉద్యోగులకు నిరాశ మిగిల్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఫిట్‌మెంట్‌ విషయంలో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ద్వజమెత్తుతున్నారు. పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌ 23 శాతంగానే  ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 27 శాతం ఐఆర్‌ తీసుకుంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ఏపీ ఉద్యోగులు ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌‌ తీసుకోనున్నారు. అయితే 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆర్ధిక ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది. కొత్త జీతాలు 2022 జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ ఊసెత్తలేదు. హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలని ఇప్పటికే సీఎస్‌ కమిటి సిఫార్స్‌ చేసింది. సీసీఏ (సిటి కాంపెన్సేటరి ఎలవెన్స్‌) గురించి ప్రభుత్వ ప్రస్తావించకపోవడం గమనార్హం. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటం పెన్షన్‌పై అధికారులు పెదవి విప్పలేదు.


ఫిట్‌మెంట్‌ విషయంలో ఉద్యోగుల అంచనాలు తల్లకిందులయ్యాయి. ఫిట్‌మెంట్‌ 23.29 శాతం ఇస్తామని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు మాత్రం 62 ఏళ్లకు పెంచుతామని జగన్ తెలిపారు. ఈహెచ్‌ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల్లో సమస్యలను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు.


Updated Date - 2022-01-07T23:00:01+05:30 IST