సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ABN , First Publish Date - 2021-01-21T23:22:08+05:30 IST

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులు ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

అమరావతి: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు 36 పేజీల తీర్పు ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జి తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగం ప్రకారం స్థానిక ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ విధి అని, ఎస్‌ఈసీకి తప్పనిసరిగా ప్రభుత్వం సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌ఈసీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు భారత ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలు ఉన్నాయని, ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది.. ఎన్నికల కమిషనే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రకృతి వైపరిత్యాలు, శాంత్రిభద్రతలకు విఘాతం సమయంలో ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. 

Updated Date - 2021-01-21T23:22:08+05:30 IST