లెవల్ జంపింగ్‌ విధానంపై ఏపీ సర్కార్‌ జీవో జారీ

ABN , First Publish Date - 2022-08-24T23:45:21+05:30 IST

లెవల్ జంపింగ్‌ విధానంపై ఏపీ సర్కార్‌ జీవో జారీ

లెవల్ జంపింగ్‌ విధానంపై ఏపీ సర్కార్‌ జీవో జారీ

అమరావతి: లెవల్ జంపింగ్‌ విధానంపై ఏపీ సర్కార్‌ జీవో జారీ చేసింది. ఉద్యోగుల విజ్ఞప్తిని పక్కనపెట్టి లెవల్‌ జంపింగ్‌ జీవోను సీఎస్‌ జారీ చేశారు. సెక్రటేరియట్ సర్వీస్‌రూల్స్‌కు విరుద్ధంగా లెవల్‌ జంపింగ్ విధానం వద్దని గతంలో సీఎం జగన్‌కు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘంలేఖ రాసింది. ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్‌ మాన్యువల్‌ను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫైల్ మూమెంట్‌ను ఇకపై జంప్ చేయించే విధంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. నిర్ణీత వ్యవధిలో ఫైళ్ల వేగం పెంచేందుకే లెవల్ జంపింగ్ విధానమంటూ ఉత్తర్వుల్లో ఏపీ సర్కార్‌ పేర్కొంది. 

Updated Date - 2022-08-24T23:45:21+05:30 IST