కరెంటు చార్జీల మోత మోగించనున్న ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2021-12-14T13:20:10+05:30 IST

త్వరలో ఏపీ ప్రజలపై కరెంటు చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే స్లాబ్‌లో ఏపీ ప్రభుత్వం భారీ మార్పులు చేయనుంది.

కరెంటు చార్జీల మోత మోగించనున్న ఏపీ సర్కార్

అమరావతి : త్వరలో ఏపీ ప్రజలపై కరెంటు చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే స్లాబ్‌లో ఏపీ ప్రభుత్వం భారీ మార్పులు చేయనుంది. తొలి 30 యూనిట్‌లకే రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేయనుంది. ఇక 31 నుంచి 75 యూనిట్ల కైతే రెండు రూపాయల ఎనభై పైసలు, ఒకటి నుంచి 100 యూనిట్ల వరకు నాలుగు రూపాయలు, 101 నుంచి 200 యూనిట్లకు ఐదు రూపాయలు, 201 నుంచి 300 యూనిట్లకు ఏడు రూపాయలు, 300 యూనిట్లు పైబడితే యూనిట్‌కు ఏడు రూపాయలు యాభై పైసలు చొప్పున వసూలు చేయనుంది. రెవెన్యూ లోటు 3685 కోట్లు పొంచి ఉన్న నేపథ్యంలో ట్రూ అప్ చార్జీల ముప్పు జనంపై పడనుంది. మొత్తమ్మీద బాదుడుకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. 


Updated Date - 2021-12-14T13:20:10+05:30 IST