పారదర్శక పాలనకు ఏపీ సర్కార్‌ తిలోదకాలు

ABN , First Publish Date - 2021-08-16T21:59:52+05:30 IST

పారదర్శక పాలనకు ఏపీ సర్కార్‌ తిలోదకాలిచ్చింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

పారదర్శక పాలనకు ఏపీ సర్కార్‌ తిలోదకాలు

అమరావతి: పారదర్శక పాలనకు ఏపీ సర్కార్‌ తిలోదకాలిచ్చింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో జీవోలను ఇవ్వడం నిలిపివేయాలని ఆదేశించింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్య్వులని సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముత్యాలరాజు జారీ చేశారు. జీవోలను ఆఫ్‌లైన్‌లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆదేశించడంతో ఇకపై పబ్లిక్ డొమైన్‌లో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు కనిపించకుండా పోనున్నాయి. కాగా 2008 నుంచి జీవోలను ఏపీ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-08-16T21:59:52+05:30 IST