ఆంధ్రా షుగర్ ఒప్పందం రద్దుపై ఏపీ హైకోర్టు స్టేటస్కో

ABN , First Publish Date - 2021-11-09T03:31:39+05:30 IST

విశాఖ ఫార్మాసిటీలో ఆంధ్ర షుగర్ కొనుగోలు చేసిన నలభై రెండు ఎకరాల ఒప్పందం రద్దు‌పై ఏపీ హైకోర్టు స్టేటస్కో విధించింది. ఆంధ్ర షుగర్స్ కొనుగోలు చేసిన..

ఆంధ్రా షుగర్ ఒప్పందం రద్దుపై ఏపీ హైకోర్టు స్టేటస్కో

అమరావతి: విశాఖ ఫార్మాసిటీలో ఆంధ్రా షుగర్ కొనుగోలు చేసిన నలభై రెండు ఎకరాల ఒప్పందం రద్దు‌పై ఏపీ హైకోర్టు స్టేటస్కో విధించింది. ఆంధ్ర షుగర్స్ కొనుగోలు చేసిన భూమిలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ రాంకీ ఆంధ్రా షుగర్ మధ్య ట్రై పాక్షిక ఒప్పందం జరిగింది. ఏపీఐఐసీ నుంచి ఆంధ్రా షుగర్స్ భూమిని కొనుగోలు చేసింది. భూమిలోకి బ్యాక్ వాటర్ వస్తుండటం, రాంకీ ఫార్మా సహకరించకపోవడంతో అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఆంధ్రా షుగర్స్ పేర్కొంది. భూమిని అభివృద్ధి చేయలేదని సాకుతో సేల్ డీడ్, ట్రై పాక్షిక ఒప్పందం, రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టులో ఆంధ్రా షుగర్ సవాల్ చేసింది. ఆంధ్రా షుగర్స్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. సేల్ డీడ్‌ను ఎలా రద్దు చేస్తారని వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని వాదనలు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు స్టేటస్కో విధించింది. 

Updated Date - 2021-11-09T03:31:39+05:30 IST