AP High Court: రాజధాని కేసులపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ

ABN , First Publish Date - 2022-08-23T19:36:32+05:30 IST

రాజధాని కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court) త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.

AP High Court: రాజధాని కేసులపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ

అమరావతి (Amaravathi: రాజధాని కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court) త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం (AP Govt.) స్టేటస్ రిపోర్టు (Status report)ను కోర్టుకు దాఖలు చేసింది. అయితే రాజధానిలో ఎటువంటి పనులు చేపట్టలేదని, పురోగతి కూడా లేదని.. రైతుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎస్ఎల్పీ (SLP) వేశారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు తీర్పులో రైతుల పరిహారానికి సంబంధించి తిరస్కరించడంతో.. దానిపై మాత్రమే ఎస్ఎల్పీ వేశామని, హైకోర్టు తీర్పును మాత్రం వ్యతిరేకించలేదని లాయర్ మురళీధర్ తెలిపారు.


ప్రభుత్వం నుంచి ఎస్ఎల్పీ వేశారా? అని.. ఏజీని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్మించింది. తీర్పును సమీక్షించాలని రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేయబోతున్నామని ఏజీ తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పెండింగ్లో ఉన్న సమయంలో.. హైకోర్టులో విచారణ సబబా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు హైకోర్టు తీర్పులో తాము కోరిన అంశాలు తిరస్కరించడంతో.. వాటిపై మాత్రమే సుప్రీం కోర్టుకు వెళ్లామని రైతుల తరఫు లాయర్ మురళీధర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో తీర్పును అమలు చేయకపోవడంతోనే.. హైకోర్టులోనే కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేశామన్నారు. అయితే ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ నివేదికపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. రాజధాని కేసులపై తిరిగి విచారణ అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2022-08-23T19:36:32+05:30 IST