AP High Court: విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-09-29T21:44:44+05:30 IST

విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల్లో ఏపీ ప్రభుత్వాని (AP Govt.)కి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది.

AP High Court: విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అమరావతి (Amaravathi): విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల్లో ఏపీ ప్రభుత్వాని (AP Govt.)కి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. స్త్రీ శిశు సంక్షేమశాఖలో విస్తరణ అధికారుల నియామకాలపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. 560 విస్తరణ అధికారుల నియామకానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాత పరీక్షలు నిర్వహించి ఇంగ్లీష్‌ ల్యాంగ్వేజ్ టెస్ట్‌‌ను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ముందుగా అభ్యర్ధులను ఎంపిక చేసుకుని, వారికే ల్యాంగ్వేజ్ టెస్ట్‌ పెట్టారని హైకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. ఒక్కో విస్తరణ అధికారి నియామకానికి రూ. పది లక్షలు వసూలు చేశారని పిటీషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్ వాదించారు.


నిన్న (బుధవారం) వేసిన లంచ్ మోషన్‌ పిటీషన్‌‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇంగ్లీష్‌ ల్యాంగ్వేజ్ టెస్ట్‌ ఎందుకు పెట్టలేదని శ్రవణ్‌ ప్రశ్నించారు. ఈ రోజు ఇంటర్వ్యూలు జరుగుతుండటంతో అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం అన్ని జోన్‌లలో నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ఆరు వారాలలో స్టే వెకేషన్‌ అనంతరమే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశిస్తూ.. కేసు విచారణ వాయిదా వేసింది.

Updated Date - 2022-09-29T21:44:44+05:30 IST