కోవిడ్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-04-22T20:47:35+05:30 IST

కోవిడ్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కోవిడ్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి: కోవిడ్-19ను కట్టడి చేయడంలో భాగంగా హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌ ద్వారా కీలక సర్క్యులర్‌ విడుదలైంది. సబార్డినేట్‌ కోర్టులు సహా ట్రిబ్యునల్‌, లేబర్‌ కోర్టులు, న్యాయసేవా సంస్ధలు, జిల్లా యూనిట్లలో 50 శాతం మంది మాత్రమే సిబ్బంది విధులకు హాజరుకావాలని మిగిలిన 50 శాతం మంది తరువాత రోజు విధులకు రావాలని హైకోర్టు పేర్కొంది. ఎవరైతే విధులకు హాజరు కారో వారు ఫోన్‌ కాల్‌లో అందుబాటులో ఉండి అవసరమైతే అత్యవసరంగా విధులకు హాజరుకావాలని గురువారం నాటి ఆదేశాల్లో పేర్కొంది. న్యాయస్ధానాల ఉద్యోగులు ఎవరూ ముందస్తు అనుమతులు లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లకూడదని, హైకోర్టులోకి ప్రవేశించేముందు పూర్తిస్ధాయిలో శానిటైజేషన్‌ చేసుకొని, మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించి హాజరుకావాలని సూచించింది. ఈ ఆదేశాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని సర్క్యులర్‌లో హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2021-04-22T20:47:35+05:30 IST