
అమరావతి (Amaravathi): సోషల్ మాద్యమాల్లో ఆమంచి కృష్ణమోహన్ (Amanchi krishnamohan) న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసుపై ఏపీ హైకోర్టు (High court)లో గురువారం విచారణ జరిగింది. కేసు కొట్టివేయాలంటూ ఆమంచి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆమంచి తరుపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో సీబీఐ (CBI) అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే విచారణలో తదుపరి చర్యలు ఉంటాయని సీబీఐ పేర్కొంది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశిస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా ఈనెల 22న వ్యక్తిగత కారణాలతో సీబీఐ విచారణకు ఆమంచి హాజరుకాలేదు.
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi krishnamohan)కు సీబీఐ(CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 41(A) కింద సీబీఐ అధికారులు ఆమంచికి నోటీసు ఇచ్చింది. కాగా ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సీబీఐ ముందు ఆమంచి కృష్ణ మోహన్ హాజరైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి