AP High Court: అన్నా క్యాంటీన్‌ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2022-07-28T01:00:59+05:30 IST

నందిగామలో అన్నా క్యాంటీన్‌ (Annaa Cantine) ఏర్పాటుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో విచారణ చేపట్టింది.

AP High Court: అన్నా క్యాంటీన్‌ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి

అమరావతి: నందిగామలో అన్నా క్యాంటీన్‌ (Annaa Cantine) ఏర్పాటుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో విచారణ చేపట్టింది. అన్నా క్యాంటీన్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అన్నా క్యాంటీన్‌పై పోలీసులు, మున్సిపల్‌ అధికారుల ఆంక్షలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. అన్నం పెడితే తప్పేముందని కోర్టు వ్యాఖ్యానించింది. అన్నా క్యాంటీన్‌ భవనం ఏర్పాటు చేసే వరకు... గాంధీసెంటర్‌లో నిర్వహించుకుంటే అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.


నందిగామ (Nandigama) గాంధీ సెంటర్ అన్నా క్యాంటీన్‌ను టీడీపీ (TDP) ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ అధికారులు, పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ ఏర్పాటు ప్రయివేటు స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల సూచించారు. దీంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-28T01:00:59+05:30 IST