టీటీడీ బోర్డులో సభ్యుల నియామకం.. ప్రభుత్వ జీవోపై విచారణ

ABN , First Publish Date - 2021-10-06T19:56:07+05:30 IST

టీటీడీ బోర్డులో 24 మందిని నియమిస్తూ ప్రభుత్వ జారీ చేసిన జీవోపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

టీటీడీ బోర్డులో సభ్యుల నియామకం.. ప్రభుత్వ జీవోపై విచారణ

అమరావతి: టీటీడీ బోర్డులో 24 మందిని నియమిస్తూ ప్రభుత్వ జారీ చేసిన జీవోపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 245ను న్యాయవాది అశ్వినీ కుమార్‌ సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. బోర్డులోని 14 మందికి నేర నేరచరిత్ర ఉందని, మరో నలుగురిని..రాజకీయ నియామకాలు చేశారని న్యాయవాది పేర్కొన్నారు. ఈ 18 మందిని ప్రతివాదులుగా చేర్చాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం 18 మందిని ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరిస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దసరా సెలవుల అనంతరం ప్రాధాన్యతగా కేసు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా 18 మందిని ప్రతివాదులుగా చేర్చడంపై టీటీడీ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీనిపై మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతివాదులకు ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పాలని వ్యాఖ్యానించింది.

Updated Date - 2021-10-06T19:56:07+05:30 IST