డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సీట్ల భర్తీపై ఏపీ హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2021-10-12T22:02:03+05:30 IST

అమరావతి: డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సీట్ల భర్తీపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.

డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సీట్ల భర్తీపై ఏపీ హైకోర్టు స్టే

అమరావతి: డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సీట్ల భర్తీపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 20 వరకు స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. మంగళవారం జీవో నెంబర్‌ 55పై  హైకోర్టులో విచారణ జరిగింది. యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లు కేటాయించి.. వాటిని కూడా కన్వీనర్ నింపడంపై అభ్యంతరం తెలుపుతూ.. యాజమాన్య కోటా కోరని కాలేజీలకు వెసులుబాటు ఇవ్వకపోవడంపై రాయలసీమ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది.


అసోసియేషన్ పిటిషన్‌ను హైకోర్టు లంచ్ మోషన్‌గా స్వీకరించింది. జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఎదుట విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ముతుకుమిల్లి విజయ్ వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 20 వరకు సీట్ల కేటాయింపు తాత్కాలికంగా నిలిపివేస్తూ.. కేసు తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.

Updated Date - 2021-10-12T22:02:03+05:30 IST