టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై ఏపీ హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-02-28T17:27:34+05:30 IST

టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కోర్టులో విచారణ జరుగుతుండగా ఆర్డినెన్స్ తీసుకురావటంపై న్యాయవాది అశ్విని కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ తీసుకువచ్చి ప్రభుత్వం మోసానికి పాల్పడిందని ఆరోపించారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ ఎలా తీసుకు వస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్డినెన్స్ ద్వారా మళ్లీ ప్రత్యేక ఆహ్వానితులను నియమించే అవకాశం ఉందని న్యాయవాది అశ్విని కుమార్ చెప్పారు. ఆర్డినెన్స్‌పై ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకున్నారు. కేసుపై తుది నిర్ణయం వచ్చే వరకు ఎవర్ని నియమించబోమని కోర్టుకు తెలిపారు. తన స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవచ్చని  ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేశారు. తిరుపతికి చెందిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Updated Date - 2022-02-28T17:27:34+05:30 IST