AP Highcourt: భూఆక్రమణదారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-08-08T18:30:38+05:30 IST

ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తున్న భూఆక్రమణదారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Highcourt: భూఆక్రమణదారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

అమరావతి: ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తున్న భూఆక్రమణదారుల తీరుపై ఏపీ హైకోర్టు (AP Highcourt) ఆగ్రహం వ్యక్తం చేశారు. భూఆక్రమణలపై ఏలూరు జిల్లా కలిదిండి మండలానికి చెందిన చాపత్తిన రాజు హైకోర్టులో పీపీఏ(PPA) దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టు (Highcourt)లో విచారణ జరిగింది. కలిదిండిలోని సర్వే నంబరు 445లో 2.52 ఎకరాల స్థలం ఆక్రమించి భవనాలు నిర్మించారని పిటిషనర్ ఆరోపించారు. వ్యాజ్యాన్ని జస్టిస్ శేషసాయి (Shesasai), జస్టిస్ వి.శ్రీనివాస్(Srinivas)లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్కుమార్ (Jada Shravan Kumar) వాదనలు వినిపించారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలంలో అక్రమ దారులు భవనాలు నిర్మిస్తున్నారని... దీని మీద చర్యలు తీసుకోమని తాహసీల్దార్, ప్రభుత్వానికి నివేదించినా చర్యలు లేవని న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. ఆక్రమణలపై రెవిన్యూ, పంచాయతీ, ప్రభుత్వ న్యాయవాదులు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు రెండు వాయిదాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-08-08T18:30:38+05:30 IST