ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ కర్కశత్వం

ABN , First Publish Date - 2022-09-30T08:32:14+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కర్కశంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ కర్కశత్వం

  • కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు
  • మా ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటోంది
  • ఐదేళ్లలో 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం
  • ఇతర సమస్యలనూ పరిష్కరిస్తాం: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 29: ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కర్కశంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తోందని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో గురువారం జరిగిన ఎస్టీయూ వజ్రోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటోందన్నారు. ఐదేళ్లలో 73శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. మనఊరు - మనబడికి రూ.7,300కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.


ఏపీకి వచ్చి అడగండి: ఏపీ మంత్రి బొత్స 

ఏపీలో ఉపాధ్యాయులకు వేతనాలు, పీఆర్సీ పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి హరీశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘హరీశ్‌ రావు అలా మాట్లాడి ఉంటే.. ఆయన ఒకసారి ఏపీకివచ్చి టీచర్లను అడిగినా లేదా వేరేవారిని అడిగినా వాస్తవం తెలుస్తుంది’’ అని అన్నారు.

Updated Date - 2022-09-30T08:32:14+05:30 IST