ఉద్యోగుల ఆందోళన వాయిదా: బండి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-12-17T03:54:22+05:30 IST

ప్రభుత్వం సానుకూలంగా తమ సమస్యలపై స్పందించిన కారణంగా, రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు అంగీకారాన్ని తెలిపిన కారణంగా...

ఉద్యోగుల ఆందోళన వాయిదా: బండి శ్రీనివాసరావు

అమరావతి: ప్రభుత్వం సానుకూలంగా తమ సమస్యలపై స్పందించిన కారణంగా, రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు అంగీకారాన్ని తెలిపిన కారణంగా ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ముగిశాయి. 


ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించింది.71 అంశాల పై కూలంకషంగా చర్చించాం. రాత పూర్వకంగా హామీ ఇస్తామని ఇచ్చిన కారణంగా ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. దురుద్ధేశం తో మేము ఉద్యమ కార్యాచరణకు వెళ్ళలేదు. ఇవాళ జరిగిన సమావేశం మినిట్స్ కూడా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. డిసెంబర్ 7 తేదీ నుంచి ఉద్యోగులు అంతా ఆందోళనలో ఉన్నారు. మా డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన కారణంగా ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం.’’ అని అన్నారు. 

Updated Date - 2021-12-17T03:54:22+05:30 IST