ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

ABN , First Publish Date - 2021-11-01T19:53:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది.

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు బుధవారం (3వతేదీ) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలో మిగిలిపోయిన పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్  సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు ఉన్నాయి. కాగా అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈరోజు ప్రారంభమైన రెండు గంటల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదలైంది. డీజీపీ ఇచ్చిన పర్మిషన్‌లో కూడా ఎన్నికల కమిషన్ విధించే ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని షరతు విధించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం రైతుల మహా పాదయాత్రలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-11-01T19:53:05+05:30 IST