కేంద్రానికి... ఇంకా చేరని ఏపీ మెట్రో ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2021-08-05T00:50:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్ లో మెట్రో పరుగుల ఆశలు ప్రస్తుతానికి గల్లంతైనట్లే కనిపిస్తోంది.

కేంద్రానికి... ఇంకా చేరని ఏపీ మెట్రో ప్రతిపాదనలు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో మెట్రో పరుగుల ఆశలు ప్రస్తుతానికి గల్లంతైనట్లే కనిపిస్తోంది. విజయవాడ-విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తామన్న ఏపీ ప్రభుత్వం... ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఈ అంశాన్ని కేంద్రమే స్వయంగా  లోక్ సభలో ప్రకటించింది. మెట్రో రైల్ పాలసీ-2017 ప్రకారం... రివైజ్డ్ ప్రపోజల్ ను కేంద్రానికి పంపాల్సి ఉన్నప్పటికీ... ఆ దిశగా ఏ మాత్రం చర్యలే లేవు. 


పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో విశాఖపట్నంలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు నుంచి బాహ్య ఆర్థిక సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనను మాత్రం అందించింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత ఆర్థిక సాయం చేసేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ అంగీకారం తెలిపింది కూడా. అయితే ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందం. రెండేళ్ళ క్రితం(2019 లో) అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్... లైట్ మెట్రో కోసం ఆర్థికసాయానన్నందించాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది తప్ప... అందుకు సంబంధించిన ప్రతిపాదనలను మాత్రం ఇప్పటివరకు అందించలేదు. 

Updated Date - 2021-08-05T00:50:54+05:30 IST