పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిమట్టం

Jul 22 2021 @ 22:17PM

గుంటూరు: పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిమట్టం చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 43.59 టీఎంసీల నీరు చేరింది. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. ఏ నిమిషంలోనైనా ప్రాజెక్టు గేట్లు అధికారులు ఎత్తనున్నారు. 50వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.