జీపీఎఫ్ ఖాతాలో రూ. 800 కోట్లు మాయం: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు

ABN , First Publish Date - 2022-06-29T22:19:20+05:30 IST

నిన్న అకౌంట్ జనరల్ కార్యాలయం నెట్‌లో ఉంచిన వివరాలు మేరకు జీపీఎఫ్ ఖాతాలో రూ. 800 కోట్లు మాయమయ్యాయని భావిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె అర్ సూర్యనారాయణ ఆరోపించారు.

జీపీఎఫ్ ఖాతాలో రూ. 800 కోట్లు మాయం: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు

అమరావతి: నిన్న అకౌంట్ జనరల్ కార్యాలయం నెట్‌లో ఉంచిన వివరాలు మేరకు జీపీఎఫ్ ఖాతాలో రూ. 800 కోట్లు మాయమయ్యాయని భావిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె అర్ సూర్యనారాయణ ఆరోపించారు. దీనిపై ఆర్ధిక శాఖ కార్యాలయ అధికారులను నిన్ననే  కలిసే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈరోజు దీనిపై మరికొంత సమాచారాన్ని సేకరించి లేఖ ద్వారా ఆర్ధిక శాఖ అధికారులకు తెలియజేశామన్నారు. అయితే అధికారులు ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదన్నారు. తమ అనుమతి లేకుండా డీఏ సోమ్ము  మార్చ్లో డెబిట్, క్రెడిట్ ఎంట్రీ కాలేదని చెప్పారు. అంతకు ఏడాది ముందు నుండి పడ్డ సొమ్ము మార్చ్‌లో తీసేశారని చెప్పారు. ఇది క్రిమినల్ చర్య తీసుకోవాల్సిన అంశం అని అధికారులకు చెప్పామన్నారు. ఇది మా అకౌంట్‌ను అనధికారికంగా హ్యాకింగ్ చేయడమే అని చెప్పామన్నారు. ఇలా చేస్తే వ్యవస్థలు ఉద్యోగి నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం వుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ కార్యాలయం వద్దకు వెళ్ళి మొత్తం వ్యవహరంపై ఫిర్యాదు చేస్తామన్నారు. 

Updated Date - 2022-06-29T22:19:20+05:30 IST