సరికొత్త అనంత

ABN , First Publish Date - 2022-04-04T15:01:40+05:30 IST

సరికొత్త అనంత

సరికొత్త అనంత

అసెంబ్లీ నియోజకవర్గాలు 8

రెవెన్యూ డివిజన్లు 3.. మండలాలు 31

అనంతలోకి రాప్తాడు.. అయినా.. అటూ ఇటూ.. 

ఎనిమిది మండలాలతో గుంతకల్లు రెవెన్యూ డివిజన


ఇలా మిగిలింది..

ఓటర్లు 19,75,052 మంది

విస్తీర్ణం 11,359 చ.కి.మీ

జనాభా 23.59 లక్షలు


ఆంధ్రజ్యోతి, అనంతపురం: పునర్విభజనతో ఉమ్మడి అనంతపురం జిల్లా సరిహద్దులు మారిపోయాయి. 19 వేల చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాను అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలుగా ప్రభుత్వం విభజించింది. దీంతో అనంతపురం జిల్లా విస్తీర్ణం 11,359 చ.కి.మీ.కు పరిమితమైంది. సరికొత్త అనంతపురం జిల్లాకు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు. రాప్తాడు, అనంతపురం అర్బన, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలు, వీటి పరిధిలోని 31 మండలాలతో అనంతపురం జిల్లా పాలన కొనసాగనుంది. అనంతను మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. ఇప్పటి వరకూ కళ్యాణదుర్గం, అనంతపురం రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్తగా గుంతకల్లు రెవెన్యూ డివిజనను ఏర్పాటు చేశారు.


- అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం, రాప్తాడు మండలాలతో అనంతపురం రెవెన్యూ డివిజనను ఏర్పాటు చేశారు. 

- రాయదుర్గం, డి. హీరేహాల్‌, కణేకల్లు, బొమ్మనహాళ్‌, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప మండలాలతో కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనను ఏర్పాటు చేశారు.

- కొత్తగా ఏర్పాటు చేసిన గుంతకల్లు రెవెన్యూ డివిజన పరిధిలోకి ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు మండలాలను చేర్చారు.

- 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతలో 43.32 లక్షల జనాభా ఉంది. జిల్లాల పునర్విభజనతో.. అనంత జనాభా  23.59 లక్షలకు పరిమితమైంది. జిల్లా పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో 19,75,052 మంది ఓటర్లు ఉన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప నేతృత్వంలో సోమవారం నుంచి 31 మండలాల్లో పాలన మొదలవుతుంది.


సరికొత్త సరిహద్దులు

తూర్పు : బొందలదిన్నె

(తాడిపత్రి రూరల్‌ మండలం)

ఉత్తరం : ఊబిచెర్ల(గుత్తి రూరల్‌ మండలం)

దక్షిణం : చెన్నేకొత్తపల్లి

పడమర : తిప్పనపల్లి(శెట్టూరు మండలం)


మార్పులు.. చేర్పులు

- తొలి నోటిఫికేషనలో.. 34 మండలాలతో అనంతపురం జిల్లా, 29 మండలాలతో పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. 

- తొలి నోటిఫికేషనలో.. 06 రెవెన్యూ డివిజన్లతో రెండు జిల్లాలుగా విభజించారు. తుది నోటిఫికేషనలో మరో రెవెన్యూ డివిజనను పెంచారు.

- తొలి నోటిఫికేషనలో 14 మండలాలతో అనంతపురం రెవెన్యూ డివిజనను ప్రకటించారు. తుది నోటిఫికేషనలో 12 మండలాలకే కుదించారు.

- తొలి నోటిఫికేషనలో 12 మండలాలతో కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనను ప్రకటించారు. తుది నోటిఫికేషనలో 11 మండలాలకు కుదించారు.

- తొలి నోటిఫికేషనలో 08 మండలాలతో కొత్తగా గుంతకల్లు రెవెన్యూ డివిజనను ప్రకటించారు. తుది నోటిఫికేషనలోనూ యథాతథాంగా ఉంచారు. 


మండలాల మార్పులు...

- రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలాన్ని తొలి నోటిఫికేషనలో కళ్యాణదుర్గం రెవెన్యూడివిజనలోకి మార్చారు. తుది నోటిఫికేషనలో ధర్మవరం రెవెన్యూ డివిజనలోకి కలిపారు.

- రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలను తొలి నోటిఫికేషనలో అనంతపురం రెవెన్యూ డివిజనలోకి కలిపారు. తుది నోటిఫికేషనలో ఆ రెండు మండలాలను ధర్మవరం రెవెన్యూ డివిజనలోకి చేర్చారు.- కదిరి నియోజకవర్గంలోని ఓడీ చెరువు మండలాన్ని తొలి నోటిఫికేషనలో కదిరి రెవెన్యూ డివిజనలోనే ఉంచారు. తుది నోటిఫికేషనలో కొత్తగా ఏర్పాటు చేసిన పుట్టపర్తి రెవెన్యూ డివిజనలోకి చేర్చారు.

- పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలాన్ని తొలినోటిఫికేషనలో పెనుకొండ రెవెన్యూ డివిజనలో ఉంచారు. తుది నోటిఫికేషనలో కొత్తగా ఏర్పాటు చేసిన పుట్టపర్తి రెవెన్యూ డివిజనలోకి చేర్చారు.


ఇలా చీల్చేశారు..

రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, అనంతపురం రూరల్‌, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. జిల్లా పునర్వి భజనలో భాగంగా.. అనంతపురం జిల్లాలో చేర్చారు. రాప్తాడు, అనంతపురం రూరల్‌, ఆత్మకూరు మండలాలను అనంతపురం జిల్లాలోని అనంతపురం రెవెన్యూ డివిజన్లో కలిపారు. కనగానపల్లి, చెన్నే కొత్తపల్లి, రామగిరి మండలాలను శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం రెవెన్యూ డివిజనలో కలిపారు. ఇలా ఒకే నియోజకవర్గంలోని ఆరు మండలాలను రెండుగా విడగొట్టి.. రెండు జిల్లాల పరిధిలోని రెవెన్యూ డివిజనలలో కలపడం పట్ల ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


సత్యసాయి జిల్లా.. 

- తొలి నోటిఫికేషనలో ధర్మవరం రెవెన్యూ డివిజనను పూర్తిగా తొలగించారు. తుది నోటిఫికేషనలో ఏడు మండలాలతో ధర్మవరం రెవెన్యూ డివిజనను పునరుద్ధరించారు.  

- తొలి నోటిఫికేషనలో 8 మండలాలతో కదిరి రెవెన్యూ డివిజనను ప్రకటించారు. తుది నోటిఫికేషనలో 7 మండలాలకే కుదించారు.  

- తొలి నోటిఫికేషనలో 8 మండలాలతో కొత్తగా పుట్టపర్తి రెవెన్యూ డివిజనను ప్రకటించారు. తుది నోటిఫికేషనలో 6 మండలాలకే కుదించారు.  

- తొలి నోటిఫికేషనలో 13 మండలాలతో పెనుకొండ డివిజనను ప్రకటించారు. తుది నోటిఫికేషనలో 12 మండలాలకు కుదించారు.

Updated Date - 2022-04-04T15:01:40+05:30 IST